అమరావతికి నాబార్డు భారీగా రుణం.. సీఆర్డీఏ అథారిటీ ఆమోదం

by Vemula.Srinu Prasad |

రాజధాని అమరావతిని ఓ సృజనాత్మక నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు...

అమరావతికి నాబార్డు భారీగా రుణం.. సీఆర్డీఏ అథారిటీ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: రాజధాని అమరావతి(Amaravati)ని ఓ సృజనాత్మక నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అడుగులు వేస్తున్నారు. అక్కడ నిర్మించే ప్రతీ భవనం విలక్షణంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 55వ సీఆర్డీఏ అథారిటీ(CRDA Authority) సమావేశం నిర్వహించింది. రాష్ట్ర రాజధానిలో నిర్మించే ప్రతీ భవనం ప్రస్ఫుటంగా కనిపంచేలా ఉండాలని, పచ్చదనంతో అలరారేలా అమరావతి నిర్మాణాలు ఉండాలని నిర్ణయించింది. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో గవర్నర్ నివాస సముదాయం లోక్ భవన్ నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా సీఆర్డీఏ అథారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో రూ.169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. అలాగే రూ. 165 కోట్ల వ్యయంతో ఏపీ జ్యూడిషియల్ అకాడమీ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.

మరోవైపు 2024-25 వార్షిక గణాంకాల నివేదికలకు సీఆర్డీఏ అథారిటీ సభ్యులు తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు నుంచి రూ. 7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. ఇ-3 సీడ్ యాక్సెస్ రహదారిని ఎన్‌ హెచ్ 16 జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రూ.532 కోట్లతో టెండర్లను పిలిచేందుకు కూడా అథారిటీ సభ్యులు ఆమోదాన్ని తెలిపారు.

Next Story