- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యటక శాఖకు సలహాదారుగా ఉండండి: రాందేవ్ బాబును కోరిన సీఎం చంద్రబాబు
ఏపీ పర్యటక శాఖకు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పర్యటక శాఖ(AP Tourism Department)కు సలహాదారుగా ఉండాలని యోగా గురువు రాందేవ్ బాబా(Yoga guru Baba Ramdev)ను సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కోరారు. విజయవాడ జీఎఫ్ఎస్టీ టూరిజం కాన్ క్లేవ్(Vijayawada GFST Tourism Conclave)లో పర్యాటక క్యారవాన్లను ఆయనతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలు రాందేవ్ బాబా తనకు తెలుసని, పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు తెలిపారు. సోషలిజం, కమ్యూనిజానికంటే టూరిజానికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాష్ట్రంలో టూరిజం డెవలప్ మెంట్ కు అన్ని చర్యలు చేపట్టామని, ముమ్ముందు నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయని, టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1000 కిలో మీటర్లకు పైగానే సముద్ర తీరం ఉందని, అలాగే అడవులు సైతం ఉన్నాయని ఆయన చెప్పారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో యోగాంధ్ర నిర్వహించామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారంలో అనుమతులు వెంటనే ఇస్తున్నామని, రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విశాఖ, రాజమండ్రి, అమరావతి, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.






