‘చాలా మంచి ఆలోచన’.. తిరుపతి పోలీసులను అభినందించిన CM

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-15 13:17:12  IST  )

‘చాలా మంచి ఆలోచన’.. తిరుపతి పోలీసులను అభినందించిన CM

‘చాలా మంచి ఆలోచన’.. తిరుపతి పోలీసులను అభినందించిన CM
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు హర్షణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(CM Chandrababu) అభిప్రాయపడ్డారు. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం "నో హెల్మెట్ – నో పెట్రోల్" నిబంధనను తీసుకు రావడం మంచి ఆలోచన అని అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు 700 మంది ద్విచక్ర వాహనాలపై పోలీసు సిబ్బందితో కలిసి హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించదాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు స్వయంగా పాల్గొనడం ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం తెచ్చే నిబంధనలు, సూచనలు పాటించాలని ప్రజలను కోరారు.

Next Story