- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం.. సీఎం కీలక ఆదేశాలు
by Naga Rani Yarlagadda |
తాజాగా ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కారును రాంగ్ రూటులో వచ్చిన టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సహా మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. తాజాగా ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జవ్వగా.. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉండటం అందరినీ కలచివేసింది.
Next Story






