- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ మద్యం ఘటన.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
కల్తీ లిక్కర్‌తో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని, తప్పుడు ప్రచారం అని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు....

దిశ, వెబ్ డెస్క్: కల్తీ లిక్కర్‌తో మరణాలు అని ప్రచారం చేస్తే దానికి రుజువు చూపాలని అడగాలని, తప్పుడు ప్రచారం అని తేలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. నకిలీ మద్యం ఘటనపై ఆయన స్పందించారు. రాజకీయ కుట్రల్లో భాగంగా సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి లాభం పొందుదామనుకుంటే ప్రభుత్వం, ప్రభుత్వ శాఖలు సైలెంట్‌గా చూస్తూ ఊరుకోవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ వ్యవహారంపై తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం కొన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ప్రతి మూడు బాటిల్స్‌లో ఒక బాటిల్ కల్తీ లిక్కర్ బాటిల్ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు కూడా అర్థం చేసుకోవాలని, వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని పార్టీ నేతలు, అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.






