- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనకాపల్లి ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి.. హోంమంత్రికి ఫోన్
అనకాపల్లి జిల్లా అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalle District) కోటవురట్ల మండలం కైలాసపట్నం(Kailashpatnam)లో బాణసంచా తయారీ కేంద్రం(Fireworks manufacturing center)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu)దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటనపై వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ‘‘అగ్నిప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది.’’ అనే విషయాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఘటనపై విచారణ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాగా అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమింది మంది మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు అప్పికొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దాడి రామలక్ష్మి, దేవర నిర్మల, పురంపాప, గుంపిన వేణుబాబు, శానవెల్లి బాబూరావు, చదలవాడ మనోహర్‌గా గుర్తించారు. వీరంతా కూలి పనికి వచ్చారు. బాధితుల్లో తూర్పుగోదావరి జిల్లకు చెందిన వారి ఎక్కువగా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.
అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి శ్రీమతి అనితతో ఫోన్‌లో మాట్లాడాను.…
— N Chandrababu Naidu (@ncbn) April 13, 2025






