- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నువ్వు ఇడుపులపాయలో ఉంటే అదే రాజధానా? జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్
ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని అని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు అని అన్నారు. మొన్నటివరకు మూడు రాజధానులు అన్నారని, ప్రపంచంలో ఎక్కడా లేవని చెప్పామని అన్నారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని పేరు లేదని అంటున్నాడని.. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటే ఇడుపులపాయ రాజధాని అవుతుందా? బెంగుళూరులో కూర్చుంటే అదే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు.
అమరావతిని దెబ్బతీసేందుకే ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చాదస్తం ఏంటో తనకు అర్థం కావడంలేదన్నారు. అమరావతి నది పక్కన ఉందని అంటున్నాడని.. ఢిల్లీ, లండన్, చెన్నై, ముంబై ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. కనీసం ఇంగిత జ్ఞానం లేనివాళ్లు ఇలా మాట్లాడితే ఏం రాజకీయాలు చేయాలని అన్నారు. ఇదిలా ఉంటే జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదం లేదన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుండి పనిచేస్తే అదే రాజధాని అన్నారు. అంతే కాకుండా అమరావతి నది పక్కన ఉందని దానికి వరద ముప్పు ఉదంని వ్యాఖ్యానించారు.






