- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్పీడులో ఫైటర్ జెట్ ఏపీకి వచ్చింది: చంద్రబాబు
దేశానికి ఏపీ రక్షణకవచంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. యుద్ధాల్లో వాడే డ్రోన్లను కర్నూలుతో తయారు చేయడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: దేశానికి ఏపీ రక్షణకవచంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. యుద్ధాల్లో వాడే డ్రోన్లను కర్నూలుతో తయారు చేయడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు. పుట్టపర్తికి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. హమ్ కా ప్రాజెక్టు పుట్టపర్తికి రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. రాయల్ ఎన్ ఫీల్డ్ మాదిరిగా అదే స్పీడ్ లో ఫైటర్ జెట్ రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు. అన్ని రంగాలలో డ్రోన్స్ వాడకం పెరిగిందని, దేశంలోనే ఆధునిక డ్రోన్ సిస్టమ్ కూడా ఏపీలోనే తయారైందని అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
యుద్దాల్లో వాడే డ్రోన్లను కూడా ఏపీలో తయారు చేయడం రాష్ట్రానికి గర్వకారణం అని అన్నారు. పుట్టుపర్తికి భవిష్యత్తులో లక్షల కోట్ల పెట్టుబడలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ అని అన్నారు. కానీ ఒకదశలో సీమలోని అనంతపూర్ జిల్లా కరువుతో విలవిల్లాడిందని చెప్పారు. పశువులకు మేత కూడా దొరకనంతగా అనంతపూర్ ను కరువు కబలించిందని చెప్పారు. అలాంటి అనంతపూర్ ను పూర్తిగా మార్చిన ఘనత ఆనాడు ఎన్టీఆర్ ది ఈరోజు ఎన్డీఏలోని తెలుగుదేశం పార్టీదేనని చెప్పారు. తెలుగు గంగా, హంద్రీనీవా ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.






