- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామోజీ రావు.. రామోజీ శైలజకిరణ్‌కు సీఐడీ నోటీసులు
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చెరుకూరి రామోజీరావు తో పాటు, ఆయన కోడలు శైలజ కిరణ్‌కు నోటీసులు జారీ చేశారు.

X
దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు చెరుకూరి రామోజీరావు తో పాటు, ఆయన కోడలు శైలజకు నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 420, 409, 120-బీ, 477(ఏ) రెడ్ విత్ 34 సెక్షన్‌లతోపాటు ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సెక్షన్ 5, చిట్ ఫండ్స్ యాక్ట్ సెక్షన్ 76,79 ప్రకారం కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సి ఉందని సీఐడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈనెల 29 లేదా 31 లేదా ఏప్రిల్ 3 లేదా 6వ తేదీల్లో ఏదో ఒకరోజు అందుబాటులో ఉండాలని సూచించారు.
Next Story






