Tirupati: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి

by srinivas |
Tirupati: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరి మృతి
X

దిశ, తిరుపతి: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. రేణిగుంట -కడప ప్రధాన రహదారిలో ఈ ఘటన జరిగింది. ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన షేక్ ఇబ్రహీం (21), షేక్ మహమ్మద్ ముషాబర్ బాషా (30)గా పోలీసులు గుర్తించారు.మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు.రేణిగుంట పోలీస్ లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story