- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల ఘాట్ రోడ్డు ప్రమాదాలకు చెక్.. ఇక ఆ వాహనాలకు నో ఎంట్రీ
12 ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది.

దిశ, తిరుపతి: 12 ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు గాను టీటీడీ నిర్ణయం తీసుకుంది. గత వారం రోజుల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 24న 28వ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఈ నెల 29న తిరుమల ఘాట్ రోడ్డు ఆరో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు గాయపడ్డారు. తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఘాట్ రోడ్డులో వాహనాల పర్యవేక్షణకు పోలీస్, విజిలెన్స్ , ట్రాన్స్ పోర్టు, విభాగాలతో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసింది టీటీడీ.
మరో వైపు 12 ఏళ్లకు పైబడిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సెల్ ఫోన్ డ్రైవింగ్ , వేగంగా వాహనాలు నడపడం, నిద్రలేమి , ఫిట్ నెస్ లేని వాహనాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఘాట్ రోడ్డులో ఫిట్ నెస్ లేని వాహనాలు ప్రమాదాలకు కారణంగా మారుతన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో 12 ఏళ్లు దాటిన వాహనాలను తిరుమల ఘాట్ రోడ్డుపైకి అనుమతి ఇవ్వకూడదని టీటీడీ నిర్ణయం తీసుకుంది.






