- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: నిజాయితీ చాటుకున్న టీటీడీ ఉద్యోగులు
తిరుమలలో టీటీడీ ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు....

X
దిశ, తిరుపతి: తిరుమలలో టీటీడీ ఉద్యోగులు నిజాయితీ చాటుకున్నారు. భక్తులు పొరపాటున వదిలి వెళ్లిపోయిన బంగారు ఆభరణాన్ని తిరిగి అప్పగించి ప్రశంసలు అందుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన భక్తులు విష్ణుపాదం గృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని వెళ్లిపోయారు. గదిని శుభ్రపరిచేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికులు రూ.2 లక్ష విలువైన బంగారు మంగళ సూత్రాన్ని గుర్తించారు. టీటీడీ ఓఎస్డీ రామకృష్ణకి సమాచారం ఇచ్చారు. దీంతో ఫోన్ నెంబర్ ఆదారంగా వారికి సమాచారం అందించారు. చివరికి భక్తులు తిరిగి తిరుమల చేరుకున్నారు. వారికి అధికారులు ఆభరణాన్ని అప్పగించారు. టీటీడీ సిబ్బంది నిజాయితీని కొనియాడిన భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






