- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupatiలో ముగ్గురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్
by Vemula.Srinu Prasad |
ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు...

X
దిశ, తిరుపతి: ముగ్గురు అంతరాష్ట్ర ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు. యర్రావారిపాలెం మండలం యల్లమంద క్రాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను వీరు గాయపరిచి పరిపోయేందుకు ప్రయత్నం చేశారు. దీంతో మిగిలిన పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 21 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలతో పాటు కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు. ఎర్రచందనాన్ని బెంగుళూరులోని ఓ బడా స్మగ్లర్‌కు చేరవేస్తారని పోలీసులు తెలిపారు. త్వరలో ఆ నిందితుడిని కూడా పట్టుకుంటామని తెలిపారు. నిందితులు తమిళనాడు వాసులని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Next Story






