- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో రష్ కంటిన్యూ.. భారీగా ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది....

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు కుటుంబ సమేతంగా శ్రీవారి వద్దకు భారీగా తరలివస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని తరించిపోతున్నారు. ఆదివారం శ్రీరామనవమి పండగ సందర్భంగా ప్రముఖులు కూడా భారీగా తరలివచ్చి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. సోమవారం(ఈ రోజు) తెల్లవారుజాము నుంచే తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలకు పైగానే సమయం పట్టే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఒక్క రోజే 72,960 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు శ్రీవారి హుండీకి భారీగా విరాళాలు, కానుకలు ఇచ్చారు. ఇలా శ్రీవారికి ఆదివారం ఆదాయం రూ. 3.63 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో భక్తులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. వేసవి దృష్ట్యా తిరుమల భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. త్వరలో స్కూళ్లకు కూడా సెలవులు వస్తుండటంతో తిరుమలలో పిల్లలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తిరుమల వెంకన్న వద్దకు ఎంతమంది భక్తులు వచ్చినా ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. తిరుమల పర్యటనకు సంబంధించి భక్తులు కూడా తగిన ప్లాన్ చేసుకుని రావాలని పిలుపునిచ్చారు.






