- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati: టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఉద్రిక్తత.. ఉద్యోగుల ఆందోళన
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పరిపాలన భవనం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగులు(Employees) ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్(Board member Naresh)ను వెంటనే విధుల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. తమకు నరేశ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా రెండు రోజుల క్రితం శ్రీవారి మహాద్వారం వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీపై బోర్డు సభ్యుడు నరేశ్ బూతులతో విరుచుకుపడ్డారు. దర్శనం పూర్తైన తర్వాత మహాద్వారం నుంచి తనను బయటకు పంపకపోవడంపై నరేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు చూస్తుండగానే బాలాజీపై ఊగిపోయారు. బూతులు తిడుతూ వెనక్కి నెట్టారు. వెంటనే టీటీడీ విజిలెన్స్ విజిలెన్స్, ఇతర అధికారులు జోక్యం చేసుకుని నరేశ్‌కు నచ్చజెప్పారు. బాలాజీని కూడా అక్కడి నుంచి పంపేశారు. అయితే ఈ ఘటనను ఉద్యోగులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రోజు టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆందోళనకు దిగారు.






