సత్యవేడుపై ఎంత మంది పెత్తనం చేస్తారు: ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-14 16:49:38  IST  )

సత్యవేడుపై ఎంతమంది పెత్తనం చేలాయిస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు...

సత్యవేడుపై ఎంత మంది పెత్తనం చేస్తారు: ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: సత్యవేడు(Satyavedu)పై ఎంతమంది పెత్తనం చేలాయిస్తారంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం(Tdp Mla Adimulam) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటే నియోజకవర్గంలోని ఎవరు పడితే వాళ్లు వస్తారా అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యేకు కాకుండా ఇతరులకు సెల్యూట్ చేస్తారా అని పోలీసులపై ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేను కాదని ఒకరు కో ఆర్డినేటర్ అని మరొకరు పరిశీలకుడు అని పనులు చేయించుకుంటారా అని ప్రశ్నించారు. ‘‘మీకేం ప్రోటోకాల్ ఉంది. ఎవరిచ్చారు మీకు అధికారం. పార్టీ పరంగా కార్యక్రమాలు చేసుకోవాలి. ఎవరైతే నాపై తప్పుడు ప్రచారం చేశారో వారిని వెనుకేసుకొస్తారా?.’’ అని ఆదిమూలం నిలదీశారు.

Next Story