Tirumala: టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం

by Disha Web Desk 16 |
Tirumala: టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తుల రద్దీతో తిరుమలలోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయాయి. టీబీసీ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వెల్లడించారు.

శుక్రవారం స్వామివారిని 73,572 మంది భక్తులు దర్శించుకోగా 29,448 మంది తలనీలాలు సమర్పించుకున్నారని అధికారలు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.73 కోట్లు వచ్చిందని వివరించారు. గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జులై 3న గరుడసేవజరుగనుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed