- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో దారుణం.. విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారం
తిరుపతిలో (Tirupati) ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో (Polytechnic Student) చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఒక ఆటోడ్రైవర్ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుపతిలో (Tirupati) ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో (Polytechnic Student) చదువుతున్న మైనర్ విద్యార్థినిపై ఒక ఆటోడ్రైవర్ (Auto Driver) అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న ఈ విద్యార్థిని వేరే హాస్టల్‌కు మారే క్రమంలో ర్యాపిడో ఆటో టాక్సీలో రిజిస్టర్ అయిన ఆటో డ్రైవర్ సాయికుమార్ పరిచయమయ్యాడు. వారి మధ్య పరిచయం పెరగడంతో సదరు ఆటో డ్రైవర్‌ను విద్యార్థిని కొంత ఆర్థిక సహాయం కోరింది. దీంతో అతను ఈ అవకాశాన్ని అలుసుగా తీసుకున్నాడని పోలీసులు అన్నారు. బాలికను తెలివిగా మభ్యపెట్టి తన గదికి తీసుకెళ్లిన అతను అక్కడ తన నీచ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పారు. అత్యాచార యత్నానికి సంబంధించిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ హేయమైన చర్య తర్వాత బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి ధైర్యం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు.
బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు సాయికుమార్‌పై క్రైమ్ నెంబర్ 448/2025 కింద, పొక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మైనర్ బాలికపై జరిగిన ఈ అఘాయిత్యం తిరుపతిలో కలకలం సృష్టించింది. ఈ చట్టం పిల్లలపై జరిగే లైంగిక నేరాలనుండి వారిని రక్షించడానికి ఉద్దేశించబడిందని పోలీసులు తెలిపారు.
అయితే ఈ దారుణఈ ఘటనపై విద్యాసంస్థల విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని త్వరగా పట్టుకుని, కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు, పౌర సమాజం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల భద్రత, ముఖ్యంగా హాస్టల్స్, ప్రయాణ సమయంలో వారి రక్షణకు సంబంధించి తల్లిదండ్రులలో, అధికారులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని.. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.






