AP | నేడు చిన్న అప్పన్నను విచారించనున్న సిట్

by Thanuru Gopichand |

తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి (Adultered Ghee) సరఫరా చేసిన కేసులో ఏ24గా ఉన్న చిన్న అప్పన్నను సిట్ నేడు విచారించనుంది.

AP | నేడు చిన్న అప్పన్నను విచారించనున్న సిట్
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి (Adultered Ghee) సరఫరా చేసిన కేసులో ఏ24గా ఉన్న చిన్న అప్పన్నను సిట్ నేడు విచారించనుంది. గత నెలాఖరున చిన్న అప్పన్నను (Chinna Appanna) పోలీసులు అరెస్టు చేశారు. అతని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో అప్పన్న కస్టడీ కోరుతూ సిట్ అధికారులు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన నెల్లూరు ఏసీబీ కోర్టు (Nellore ACB Court) ఐదు రోజుల పాటు అప్పన్నను విచారించేందుకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో సిట్ అధికారులు చిన్న అప్పన్నను సోమవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చిన్న అప్పన్నను సిట్ అధికారులు (SIT Officials) విచారించనున్నారు.

Next Story