- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ పిచ్చి.. ఇంకా కనిపించని మృతదేహం
by Vemula.Srinu Prasad |
రిల్స్ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: రిల్స్ పిచ్చితో ఓ యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నారు. జలపాతంలోకి దూకి ప్రమాదంలో పడ్డారు. నీటిలో కొట్టుకుపోయి ఇప్పటివరకూ మృతదేహం ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. స్థానిక చికెన్ షాపులో పని చేసే యూనస్ రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి కల్యాణ రేవు జలపాతం వద్దకు వెళ్లారు. రీల్స్ కోసం జలపాతంలోకి దూకారు. జలపాతంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో యూనస్ అందులో కొట్టుకుపోయారు. అయితే జలపాతంలోకి దూకే ముందు స్నేహితులతో వీడియో రికార్డ్ చేయించారు. అయితే రెండు రోజుల అవుతున్నా యూనస్ మృతదేహం లభించలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు.. యూనస్ కోసం గాలిస్తున్నారు. జలపాతం వద్దకు పర్యాటకులను నిషేధించారు. ఊసరి పెంట వద్దకు మృతదేహం వస్తుందేమోని అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
Next Story






