- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిత్తూరు జిల్లాలో విషాదం.. ఉరివేసుకుని దంపతుల సూసైడ్
by Vemula.Srinu Prasad |
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలం వేవూరుకు చెందిన భార్య మల్లమ్మ, భర్త రామప్ప కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో విషాదం చోటు చేసుకుంది. కుప్పం మండలం వేవూరు(Kuppam Mandal, Vevur)కు చెందిన భార్య మల్లమ్మ, భర్త రామప్ప కొంతకాలంగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారు. దీంతో భార్య మల్లమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య మృతితో మనస్తాపం చెందిన రామప్ప బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇద్దరూ కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, మల్లమ్మ, రామప్పలా ఆత్మహత్య చేసుకోవద్దని పోలీసులు సూచించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






