- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమన ఫోన్ చేస్తే.. నేను కట్ చేయలేదు - పల్లా
palla srinivas reacts on Bhumana Karunakara Reddy phone call

దిశ, వెబ్ డెస్క్ : భూమన కరుణాకరరెడ్డి ( Bhumana Karunakara Reddy ) ఫోన్ చేస్తే.. తాను కట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ( Palla Srinivasa Rao). లైవ్ లో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసినట్లు భూమన కరుణాకరరెడ్డి చెబుతున్నారు. భూమనను గోశాలకు రమ్మని సవాలు చేశారు పల్లా శ్రీనివాసరావు. ఈ తరుణంలోనే టీడీపీ (TDP) అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసినట్లు భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. కానీ ఫోన్ చేస్తే..పల్లా కట్ చేసాడని వెల్లడించారు. అయితే భూమన కరుణాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా భూమన కరుణాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.
హైందవ ధర్మం మీద నమ్మకం లేని భూమన గోవుల గురించి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. హిందూ మతం గురించి మాట్లాడే మీరు క్రైస్తవ విధానంలో కుమార్తె పెళ్ళి ఎందుకు చేశారో చెప్పండని ప్రశ్నించారు. ఇకనైనా డ్రామాలు ఆపితే మంచిందని చురకలు అంటించారు. పల్లా శ్రీనివాస్ వస్తేనే సమాధానం చెబుతా అనడం ఎందుకు ? అక్కడ ఉన్న మా నాయకులకు ముందు సమాధానం చెప్పండి అని వెల్లడించారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.
అవకాశం కల్పిస్తే మీరు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. భూమన ఫోన్ చేస్తే నేను కట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఆయన ఫోన్ చేశాడని గుర్తించడానికి భూమన ఫోటో పెట్టుకుని తిరుగుతామా....?అని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాకు అనేక కాల్స్ వస్తుంటాయన్నారు. ఆయన ఫోన్ అని నాకు ఎలా తెలుస్తుంది అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.






