- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులపై కారంచల్లిన వృద్ధురాలు.. విజయవాడ కలెక్టరేట్లో కలకలం
విజయవాడ కలెక్టరేట్లో ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లింది. తనకు రావలసిన పరిహారం ఇప్పించకపోవడంతో ఆమె ఈ పని చేసినట్లు సమాచారం.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని కలెక్టరేట్లో భూ సేకరణ విభాగంలో పనిచేస్తన్న ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కలెక్టరేట్ కు పరిహారం కోసం రాగా ఎవ్వరూ పట్టించుకోకపోవడతో ఆగ్రహంతో ఆమె ఈ పనిచేసినట్లుగా తెలుస్తోంది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన వెలగపూడి లక్ష్మీతులసి అనే వృద్ధురాలు తనకు చెందిన భూమికి రావలసిన పరిహారం కోసం కలెక్టరేట్ కు వెళ్లారు. అక్కడ అధికారులు సరైన స్పందన ఇవ్వలేదని భావించిన ఆమె.. ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైంది. అంతే.. తన కోపాన్ని అక్కడున్న ఉద్యోగులపై చూపించింది. వారిపై కారం చల్లడంతో అంతా షాకయ్యారు. 2003లో రోడ్డు విస్తరణ కోసం తన భూమిని తీసుకుని, ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. దాదాపు 2 సెంట్ల 20 గజాల భూమి రోడ్డు విస్తరణలోనే పోయిందన్నారు. అందుకు రూ.24 లక్షలు పరిహారం రావాలని, దానికోసం తిప్పించుకుంటున్నారని వాపోయారు.






