ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్.. మంత్రి లోకేష్ ఎగ్జిక్యూషన్

by Thanuru Gopichand |

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)

ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్.. మంత్రి లోకేష్ ఎగ్జిక్యూషన్
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu).. మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. వారి ఘనతను కొనియాడుతూ ట్విట్టర్ లో పోస్టు చేశారు. చంద్రబాబు గారి విజన్.. లోకేష్ గారి ఎగ్జిక్యూషన్. ఇదే గూగుల్ ప్రాజెక్ట్ (Google Project) వెనుక రహస్యం అంటూ కొనియాడారు. మంత్రి లోకేష్ అమెరికా టూర్లో గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి అన్నారు. వారి ప్రయత్న ఫలితంగా దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు.

దేశంలోనే తొలి ఏఐ హబ్..

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ దేశంలోనే తొలి ఏఐ హబ్ (AI Hub). ఇందులో 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టనున్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా 2లక్షలకు పైగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా అంతర్జాతీయ నెట్వర్కు కు సెంటరును అనుసంధానిస్తారు. తద్వారా నగరానికి అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ కేంద్రంగా గుర్తింపు రానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది టెక్ స్టూడెంట్స్, ఇంజనీర్లు, పరిశోధకులు నేరుగా లాభపడతారని అంచనా.

Next Story