తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి నుంచి ఈరోజుకు కిలో చికెన్ పై ఏకంగా రూ.70 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా చికెన్ కు గిరాకీ ఏర్పడటంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెప్తున్నారు. నిన్నటి వరకూ ఏపీలో కేజీ చికెన్ ధర రూ.330 ఉండగా ఈరోజు ఏకంగా రూ.70 పెరగడం గమనార్హం. విజయవాడలో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ.380 - రూ.400 వరకూ పెరిగింది. హైదరాబాద్ లో శనివారం కిలో చికెన్ ధర రూ.340-350 వరకూ ఉంది. నాటుకోడి ధరలైతే చెప్పనక్కర్లేదు. కేజీ వెయిట్ ఉండే నాటుకోడి ధర వ్యాపారులు రూ.800 వరకూ చెప్తున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడటంతో డిమాండ్ కు తగిన సప్లై లేక చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా ధరలు పెరగడం వల్ల పౌల్ట్రీ రైతులు రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేజీ చికెన్ ధరలు అరకిలో మటన్ రేటుకు చేరువవుతుండటంతో చాలామంది వినియోగదారులు చేపలు లేదా ఇతర సీ ఫుడ్ వైపు మొగ్గుచూపుతున్నారు.

Next Story