- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ విచారణకు చెవిరెడ్డి..మరోసారి జైలు వద్ద హల్‌చల్
by Ajay Maddhiboyina |
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నేడు సిట్ విచారణకు హాజరయ్యే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం కేసులో నేడు సిట్ విచారణకు హాజరయ్యే ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. దేవుడు చూస్తూ ఊరుకోడని, సమాధానం చెబుతాడని అన్నారు. సిట్ వద్ద గొప్ప గొప్ప దర్శకులు రాజమౌళి, సుకుమార్ ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ ఇటీవల అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ ఈ రోజు నుండి మూడు రోజుల పాటు విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వారిని విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో ఆయన హల్ చేయగా గతంలో అరెస్ట్ చేసిన సమయంలోనూ మెడికల్ టెస్టుల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
Next Story






