- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kakinada:అన్ని లారీలను తనిఖీ చేయండి..మంత్రి మనోహర్ ఆదేశం
by Jakkula.Mamatha |
కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు.

X
దిశ,వెబ్‌డెస్క్:కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక నిఘా పెట్టారు. ఇటీవల కాకినాడ పోర్టును పరిశీలించిన ఆయన అక్కడ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. రేషన్ మాఫియాకు కాకినాడ పోర్టు అడ్డాగా మారిందని మంత్రి మనోహర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 8 విభాగాల పర్యవేక్షణలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు. కాకినాడ యాంకరేజ్ నుంచి ముంబై రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో నిన్న(సోమవారం) ఒక్కరోజే రీసైక్లింగ్ రేషన్ బియ్యం తరలిస్తున్న 6 లారీలను గుర్తించినట్లు తెలిపారు. దీంతో నేడు (మంగళవారం) పోర్టు మార్గంలో అన్ని లారీలను తనిఖీ చేయాలని మంత్రి నాదేండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
Next Story






