Chandrababu Naidu : మంత్రులకు చంద్రబాబు వార్నింగ్

by Muthe.Rajitha |   (  Updated:2025-08-06 10:18:32  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మంత్రులకు కీలక హెచ్చరిక చేసారు.

Chandrababu Naidu : మంత్రులకు చంద్రబాబు వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మంత్రులకు కీలక హెచ్చరిక చేసారు. ఏపీలో దర్యాప్తు జరుగుతున్న లిక్కర్ కేసు(AP liquor Case)పై గాని, ఈకేసులో అరెస్టులపై గాని మంత్రులెవరూ మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈకేసులో సిట్(SIT) విచారణ జరుపుతోందని... ఇకపై ఎవరూ దీనిపై మాట్లాడవద్దని సూచించారు. అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ ఏడాది హాలిడే టైం ముగిసిందని, ఇకపై అంతా యాక్టివేట్ అయ్యి, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, వీలైనంత ఎక్కువసమయం క్షేత్రస్థాయిలో ఉండాలని తెలియజేశారు.

కాగా ఏపీ లిక్కర్ కేసు(2019-2024)లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపిన సిట్ రాష్ట్రానికి రూ. 3,200 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపింది. ఈ విధానం ద్వారా జాతీయ బ్రాండ్లను తొలగించి, స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించి, రూ. 50-60 కోట్ల నెలవారీ లంచాలు తీసుకున్నారని పేర్కొంది. ఈకేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పి.వి. మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి 12 మందిని అరెస్టు చేసి, మరో 12 మందిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు SIT తెలిపింది.

ఏపీ అభివృద్ధిపై హీరో సుమన్ కీలక వ్యాఖ్యలు

Next Story