- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇక్కడ ఉన్నది CBN, పవన్ కల్యాణ్’.. జగన్‌కు చంద్రబాబు వార్నింగ్
వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అనంతపురం వేదికగా సూపర్‌సిక్స్-సూపర్‌హిట్ పేరుతో కూటమి పార్టీలు బహిరంగసభ ఏర్పాటు చేశాయి. సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ అంటే ఏంటో జగన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. భూమి ఇవ్వగానే అది మెడికల్ కాలేజీ అయిపోదు అని కౌంటర్ ఇచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఒక్కటే పూర్తయ్యింది. గత పాలకులు మెడికల్ కాలేజీలకు పునాదులేసి వదిలేశారు. అందుకే మా హయాంలో పీపీపీ విధానం తీసుకొచ్చామని చంద్రబాబు స్పష్టం చేశారు.
మెడికల్ కాలేజీలపై అసెంబ్లీలో చర్చకు రావాలని జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఘనత కూడా తమదే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతోంది. వైసీపీ(YCP) ఆఫీసులు మూసేసి సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. మేం కాదు. వైసీపీ నేతలకు అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్ చేశారు. అసెంబ్లీకి రాకుండా రప్పారప్పా అంటూ రంకెలేస్తున్నారు.. ఇక్కడ ఉన్నది చంద్రబాబు, పవన్ కల్యాణ్(Pawan Kalyan).. బెదిరింపులకు తాము భయపడే వ్యక్తులం కాదని హెచ్చరించారు. ఒంటిమిట్ట, పులివెందులలో ప్రజలు మీ బెండు తీశారు. హింసా రాజకీయాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని చంద్రబాబు స్పష్టం చేశారు.






