ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నా.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

వ్యక్తిగత పర్యటన నిమిత్తం సతీమణి భువనేశ్వరితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) లండన్‌కు వెళ్లారు.

ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నా.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: వ్యక్తిగత పర్యటన నిమిత్తం సతీమణి భువనేశ్వరితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) లండన్‌కు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం లండన్‌ చేరుకున్న వారికి అక్కడి తెలుగు కుటుంబాలు ఘనస్వాగతం పలికాయి. తెలుగు వారిని చంద్రబాబు దంపతులు ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ పెట్టారు.

‘‘వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న నాకు, నా సతీమణి భువనేశ్వరికి ఇక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలకడం ఆనందం కలిగించింది. ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు, ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నాను’’ అని ట్వీట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. ట్వీట్

Next Story