- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు అరెస్ట్ బీజేపీ కుట్ర.. వైసీపీతో కలిసి ప్లాన్: మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని అయినప్పటికీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ కుట్ర ఉందని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు. రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఎంపీ జీవీ హర్షకుమార్ పరామర్శించారు. భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. అనంతరం హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్‌ను తానుఖండిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్‌లో వైసీపీ, బీజేపీ హస్తముందని ఎంపీ జీవీ హర్ష కుమార్ ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబు నాయుడును ఏమీ చేయలేరని హర్షకుమార్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వైసీపీ స్వయంకృతాపరాధం అన్నారు. తన ఓటమిని వైసీపీ చేజేతులా తెచ్చుకుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా అరెస్ట్ చేసిన అనంతరం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పుకొచ్చారు.






