చంద్రబాబుకు అన్యాయంగా రిమాండ్ విధించారు..జగన్ పద్ధతి మార్చుకో : మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

by Disha Web Desk 21 |
చంద్రబాబుకు అన్యాయంగా రిమాండ్ విధించారు..జగన్ పద్ధతి మార్చుకో : మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీపై మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు తన చెప్పుతో తానే కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని అన్నారు. వైసీపీకి ఓటేసి పెద్దతప్పు చేశానని డీఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందుపై సంచలన ఆరోపణలు చేశారు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. చంద్రబాబు నాయుడు 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌లో ఎక్కడ తప్పు చేసినట్లు లేదు అని చెప్పుకొచ్చారు. న్యాయ చరిత్రలోనే ఇటువంటి ఆర్డర్ ఇచ్చిన న్యాయమూర్తిని ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. ఎటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ విధించారు అని ఆరోపించారు. జడ్జిమెంట్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ మాదిరి దేశం విడిచి వెళ్లే వ్యక్తి చంద్రబాబు కాదు అని అన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచిన హాజరయ్యే వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. 73 ఏళ్ల వయసులో..అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని జైలుకు పంపడం దారుణమన్నారు. కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగా వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జైలుకు పంపారని అన్నారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేశారని అక్కడే ఉన్న కోర్టులో హాజరుపరచకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తండ్రి స్నేహితుడిగా సలహా ఇస్తున్నా ఇకనైనా జగన్ కక్ష సాధింపులు మానుకోవాలని అని డీఎల్ రవీంద్రారెడ్డి హితవు పలికారు.

మసిపూడి మారేడు కాయ చేయాలన్నదే జగన్

వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో విద్యుత్ ఉండటం లేదన్నారు. రోజుకు మూడు నాలుగు గంటలు కూడా కరెంట్ ఉండటం లేదని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. విద్యుత్తును కొనేందుకు డబ్బు లేదని అధికారులు అంటున్నారని... ఇంతటి ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు అని చెప్పుకొచ్చారు. దీనికి కారణం ముఖ్యమంత్రిదా? అధికారులదా? అనేది తెలియడం లేదు అని చెప్పుకొచ్చారు. కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వలేమంటున్న అధికారులు ప్రత్యామ్నాయంగా పైరుకు కావలసిన విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి అని సూచించారు. కనీసం ప్రభుత్వం దగ్గర జీతాలు ఇచ్చేందుకే డబ్బు లేదు అని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సౌకర్యాలు లేవు అలాంటిది ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం ఎందుకోనంటూ సెటైర్లు వేశారు. వైఎస్ జగన్ ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలనుకుంటున్నాడు అని మండిపడ్డారు. అలాగే జగన్ తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికలపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మార్గదర్శి దేశంలోనే బ్రహ్మాండమైన చిట్ పండ్ కంపెనీని వేధించడం కూడా అందులో భాగమేనని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పుకొచ్చారు.


Next Story