- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానిని ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు
by Ajay Maddhiboyina |
ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని, టీడీపీ కార్యకర్తకు నేరుగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. రా

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని, టీడీపీ కార్యకర్తకు నేరుగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ టీడీపీ కార్యకర్త, చంద్రబాబు అభిమాని కాగా ఇటీవల ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. తన ఆరోగ్యం క్షీణించడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని తన కోరిక అని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ విషయం పార్టీ కార్యకర్తలకు తెలియడంతో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో శనివారం స్వయంగా సీఎం చంద్రబాబు ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆస్పత్రి బిల్స్ పంపాలని తాను చూసుకుంటానని కుటుంబానికి హామీ ఇచ్చారు.
Next Story






