అయోధ్య శ్రీరాముని చెంత చంద్రబాబు.. ఆధ్యాత్మిక అనుభూతిని పంచిన దర్శనం

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయోధ్యలో నూతనంగా నిర్మించిన అత్యంత వైభవమైన శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించి, బాలరాముడిని దర్శించుకున్నారు.

అయోధ్య శ్రీరాముని చెంత చంద్రబాబు.. ఆధ్యాత్మిక అనుభూతిని పంచిన దర్శనం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu) అయోధ్యలో నూతనంగా నిర్మించిన అత్యంత వైభవమైన శ్రీరామ జన్మభూమి మందిరాన్ని సందర్శించి, బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ మందిర దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ఇచ్చిందని, ఈ పవిత్ర క్షేత్రాన్ని మరోసారి సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

భగవాన్ శ్రీరాముడు చూపిన ధర్మం, విలువలు, ఆదర్శాలు ఎప్పటికీ కాలాతీతమైనవని, అవి సమాజానికి నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని చంద్రబాబు కొనియాడారు. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఆయన ఆదర్శాలు మనందరిలో స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన భక్తిని చాటుకున్నారు.

Next Story