రేపు సామూహిక గృహ ప్రవేశాలు.. హాజరు కానున్న చంద్రబాబు నాయుడు

by Muthe.Rajitha |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.

రేపు సామూహిక గృహ ప్రవేశాలు.. హాజరు కానున్న చంద్రబాబు నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో రేపు జరగనున్న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రజావేదికలో నూతన గృహ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే రేపు అదే కార్యక్రమంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాట్లాడనున్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ సామూహిక గృహప్రవేశ కార్యక్రమం గత నెలలోనే జరగాల్సి ఉండగా.. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా పడింది.

Next Story