Chandrababu Naidu : సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ

by Muthe.Rajitha |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CN Chandrababu Naidu)కు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్(Bill Gates) లేఖ రాశారు.

Chandrababu Naidu : సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CN Chandrababu Naidu)కు మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్(Bill Gates) లేఖ రాశారు. గేట్స్ ఫౌండేషన్(Gates Foundation) తో జరిగిన ఒప్పంద భేటీ గురించి ప్రస్తావిస్తూ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. మా సంస్థతో ఒప్పందం కోసం చొరవ చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంటూ.. స్నేహ పూర్వక వాతావరణంలో సమావేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, వైద్యంపై అవగాహన ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నట్టు బిల్ గేట్స్ పేర్కొన్నారు. కాగా ఇటీవల ఢిల్లీలో బిల్ గేట్స్ తో సమావేశం అయిన చంద్రబాబు.. ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చలు జరిపారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి రంగాలలో ఏఐ వంటి ఆధునిక సాంకేతిక వినియోగంపై వీరు ఇరువురు చర్చించినట్టు చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే.

Next Story