- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో చంద్రబాబు .. మహారాష్ట్రలో పవన్
ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి మన కూటమి నేతలు దన్నుగా నిలుస్తున్నారు.

దిశ, డైనమిక్‌బ్యూరో : ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి మన కూటమి నేతలు దన్నుగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్.. నిన్న ఢిల్లీలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో మన నేతల హవా ఉత్తరాదిలో కూడా పనిచేసిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా గతంలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రచారం చేశారు. పుణె, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఎక్కవ శాతం నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి గెలుపొందింది. సనాధన ధర్మాన్ని రక్షించాలని , బీజేపీ అండగా నిలబడాలని ఆయన అక్కడ కోరారు. ఆ సమయంలో చంద్రబాబు కూడా ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నా.. ఆయన సోదరుడి మృతి కారణం ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు. సరిగ్గా రెండు నెలల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు వాళ్లు ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. చంద్రబాబు ప్రచారం చేసిన షాదారా, విశ్వాస్ నగర్, సంగం విహార్, సహద్ర వంటి ప్రాంతాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.
ఏపీలో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కలసి కట్టుగా సాగుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి కావలసిన నిధులను రాబడుతున్నాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలుపునకు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన తమ వంతు సాయం అందిస్తున్నాయి. బీజేపీ నాయకత్వంపై ఇరు పార్టీల నమ్మకాన్ని వ్యక్తం చేయడంపై అక్కడ తెలుగు వారి ఓట్లను ప్రభావితం చేయగలిగిందని రాజకీయ నేతలు భావిస్తున్నారు






