- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భోగి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
ఏపీలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఇవాళ రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి పాల్గొన్నారు. అమరావతి జేఏసీ, టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీల అధినేతలు ఇద్దరు భోగి మంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. అనంతరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వారు తిలకించారు.
Next Story






