మూడు రాజధానులన్నాడు.. ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు.. చంద్రబాబు

by Disha Web Desk 3 |
మూడు రాజధానులన్నాడు.. ఒక్క రాజధాని కూడా లేకుండా చేశాడు.. చంద్రబాబు
X

దిశ వెబ్ డిస్క్: రా కదిలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ బహిరంగసభలు నిర్వహిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాల్లో అధికార పార్టీ ఏం చేసిందంటూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ బహిరంగ సభలో ఆరోపించారు. అలానే మూడు రాజధానులు కడతానన్న జగన్ రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేకుండా చేసాడని మండిపడ్డాడు. ఐదు సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా రాజధాని లేని పరిపాలన చేస్తున్నాడంటే అది జగన్ అసమర్థతే అని ఆరోపించారు.

ఇక తెలుగుదేశం పార్టీ పైకి జగన్ వదిలిన బాణం ఏమైంది..? జగన్ వైపే దూసుకు వస్తుంది అని ఎద్దేవ చేసారు. వై.ఎస్ మృతికి రిలయెన్స్ కారణం అని రిలయెన్స్ పై దాడి చేసారు.. తీరా రిలయెన్స్ వాళ్ళు రాగానే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు.పదేపదే పేదవాళ్లకు పెత్తందార్లకు యుద్ధం అని ప్రసంగించే జగన్ .. దేశంలోనే ధనిక సీఎం అని పేర్కొన్నారు. ఆ ధనిక సీఎం జగన్ ప్రజలను నిరుపేదలను చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీ మంత్రుల గురించి చెప్పాల్సిన పనిలేదన్న ఆయన.. డయాఫ్రం వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అని, ఐటీ మంత్రి అభివృద్ధి అంటే కోడిగుడ్డు అని కొత్త నిర్వచనం చెప్పాడని, క్లబ్బులో పబ్బుల్లో కాలం గడిపే వాళ్ళు మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

బీసీ, ఎస్సీ, మైనార్టీ ఇలా ఏ ఒక్కరికి న్యాయం చెయ్యకుండా బస్సు యాత్రలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక కాపులకు టీడీపీ హయాంలో ఇచ్చిన రిజర్వేషన్ తీసేసి వాళ్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. రొయ్యల చెరువులు తవ్వాలన్న, ఇల్లు కట్టుకోవాలనుకున్న అక్కడి మ్మెల్యేకి డబ్బు ఇవ్వాల్సిన దుస్థితి ఈ రోజు ఆంధ్రాలో ఉందని పేర్కొన్నారు. పేదలకు ఇస్తాన్న ఇల్లు కట్టివ్వడానికి డబ్బులు లేవన్న నాయకులు ప్యాలెస్ లు కట్టుకుంటున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే టిడ్కో ఇల్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed