- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Heavy Rain Alert:ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంటుంది.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం నెలకొంటుంది. పగలంతా ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఎండలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు.. వర్షాలు పడుతుండటం వేసవి నుంచి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి చల్లని కబురు చెప్పింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అలాగే కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ(Andhra Pradesh)లో నేడు(శనివారం), రేపు(ఆదివారం) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ(MD of the Disaster Management Authority) రోణంకి కూర్మనాథ్(Ronamki Kurmanath) తెలిపారు. ఈ క్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు పడటంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు. ప్రస్తుతం వాతావరణంలో నెలకొంటున్న భిన్నమైన మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు హెచ్చరించారు.






