- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడప సెంట్రల్ జైల్లో ఖైదీ వద్ద సెల్ఫోన్లు.. జైళ్లశాఖ డీజీ కీలక నిర్ణయం
కడప జిల్లాలో ఉన్న సెంట్రల్ జైలులో ఓ ఖైదీ వద్ద సెల్ఫోన్లు దొరికిన ఘటన కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో ఉన్న సెంట్రల్ జైలులో ఓ ఖైదీ వద్ద సెల్ఫోన్లు దొరికిన ఘటన కలకలం రేపింది. దీనిపై విచారణకు ఆదేశించామని, డీఐజీ రవికిరణ్ ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని జైళ్ల శాఖ డీజీ అంజనీ కుమార్ తెలిపారు. పీడీ యాక్ట్ కింద అరెస్టై కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి నుంచి 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జైల్లో సెల్ఫోన్లు లభ్యమైన ఘటనలో ఏడుగురు జైలు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
మంగళవారం జైలు అధికారులను మరోమారు ఆరా తీయగా.. ఇకపై జైల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని జైలు అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. జైలు సిబ్బందిపై తనకు నమ్మకం ఉందన్న డీజీ.. ఇకపై కడప మహిళల జైల్లో వృత్తి, నైపుణ్య కోర్సుల్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే మదనపల్లి సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జైళ్లలో యోగా కోర్సులు నిర్వహించి.. ఆరు నెలల్లో ఒక్కో జైలు నుంచి 15-20 మంది ఖైదీలను యోగా శిక్షకులుగా తయారు చేస్తామని వివరించారు.






