- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala : తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖుల సందడి
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి(Tirumala Srivaru)ని శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి(Tirumala Srivaru)ని శుక్రవారం వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy), తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavati Rathod), ఎమ్మెల్సీ దయానంద్, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(Anirudh Reddy), ఎమ్మెల్యే సత్యనారాయణ(Satyanarayana)లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక సేవలలో పాల్గొన్నారు.
హీరోయిన్ హన్సిక మోత్వాని(Heroine Hansika Motwani) దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపీ విరామ సమయంలో భర్త సోహైల్ ఖతురియాతో కలసి హన్సిక స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకొన్నారు.
దర్శనానంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నానని..ఐనప్పటికి మీరంతా నన్ను గుర్తు పెట్టుకుని అభిమానించడం.. తిరుమలలో నా పాత మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా పరిపాలన పరంగా మాత్రమే విడిపోయారని..రెండు రాష్ట్రాల అభివృద్ధికి నా అనుభవాన్ని అందిస్తానన్నారు. తెలుగు ప్రజల మధ్య అనుబంధాలను రాష్ట్రాల హద్ధులు వీడదీయలేనివన్నారు.






