- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసు.. నల్లపాడు పీఎస్‌కు కృష్ణంరాజు తరలింపు
అమరావతి (Amaravati) వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు (Krishnamraju)ను పోలీసులు విశాఖపట్నం జిల్లా తగరపువలస (Thagarapuvalasa) వద్ద అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి (Amaravati) వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు (Krishnamraju)ను పోలీసులు విశాఖపట్నం జిల్లా తగరపువలస (Thagarapuvalasa) వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను బుధవారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక వాహనంలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఇవాళ కృష్ణంరాజును మంగళగిరి కోర్టులో హాజరుపరచునున్నారు.
కాగా, అమరావతి (Amaravati) వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులు కొమ్మినేనితో పాటు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని రైతులు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష జూన్ 7న గుంటూరు జిల్లా తుళ్లూరు (Tullur) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టం, ఇతర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే కొమ్మినేనిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.






