Cabinet Meeting: కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు భారీ గుడ్ న్యూస్

by Kema Shiva Kumar |

సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Cabinet Meeting: కొనసాగుతోన్న ఏపీ కేబినెట్ భేటీ.. మహిళలకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి (Velagapudi)లోని సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. అయితే, ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ‘తల్లికి వందనం’ పథకం అమలుకు గాను నిధుల విధులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ అమలులో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని ప్రకటించింది. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థుల తల్లుల అకౌంట్లలో ప్రతి సంవత్సరం రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 15 వేలు విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్లలో వేయనున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు అనగా జూన్ 15న ప్రతి తల్లి అకౌంట్‌లో నగదు జమ చేస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో ‘తల్లికి వందనం’ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Next Story