- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత నేడు ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మూడు కొత్త జిల్లాల (మదనపల్లె, పోలవరం, మార్కాపురం) ఏర్పాటుతో పాటు పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. వీటితో పాటు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో సుమారు రూ.103.96 కోట్ల వ్యయంతో 2 ఎకరాల్లో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పాటు, అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే దిశగా ఈ నిర్ణయం కీలకం కానుంది.
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ కోసం చేపట్టిన టెండర్లు, పీపీపీ (Public-Private Partnership) విధానంపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ, అభ్యంతరాలను అధిగమించేలా అధికారులకు సూచనలు చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రాజధాని అమరావతి అభివృద్ధి పనులు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.






