- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీర్య కేంద్రంలో బ్రూసెల్లోసిస్ వ్యాధి కలకలం.. ఇద్దరు కూలీలకు పాజిటివ్!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఘనీకృత వీర్య కేంద్రం (సెమన్ బ్యాంక్) లో ప్రమాదకరమైన 'బ్రూసెల్లోసిస్' వ్యాధి కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఘనీకృత వీర్య కేంద్రం (సెమన్ బ్యాంక్) లో ప్రమాదకరమైన 'బ్రూసెల్లోసిస్' వ్యాధి కలకలం రేపుతోంది. ఈ కేంద్రంలోని పశువులతో పాటు అక్కడ పనిచేసే ఇద్దరు కూలీలకు కూడా ఈ వ్యాధి సోకడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పశువుల నుండి మనుషులకు వ్యాపించే గుణం ఉన్న ఈ వ్యాధి ఇక్కడ బయటపడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ప్రస్తుతం బనవాసి సెమన్ బ్యాంక్‌లో ఉన్న పశువులకు పరీక్షలు నిర్వహించగా, వాటిలో ఎనిమిది పశువులకు బ్రూసెల్లోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి మిగిలిన పశువులకు వ్యాపించకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వ్యాధి సోకిన ఆ ఎనిమిది పశువులను వెంటనే ప్రధాన వలయం నుండి వేరు చేసి, బయట ఉన్న ప్రత్యేక షెడ్‌లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. పశువుల ద్వారా వ్యాధి బారిన పడ్డ ఇద్దరు కూలీలను అధికారులు విధులకు దూరంగా ఉంచారు. వారికి వైద్య నిపుణుల సమక్షంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కేంద్రంలోని ఇతర సిబ్బందికి, పశువులకు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు.






