BREAKING: ఆపరేషన్ పిఠాపురం.. పవన్‌ను చావుదెబ్బ కొట్టేందుకు జగన్ పక్కా వ్యూహం

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-20 12:55:32  IST  )

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అప్పుడే మంటలు పుట్టిస్తున్నాయి.

BREAKING: ఆపరేషన్ పిఠాపురం.. పవన్‌ను చావుదెబ్బ కొట్టేందుకు జగన్ పక్కా వ్యూహం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అప్పుడే మంటలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గా్ల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. దీంతో నేతలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ సవాళ్లకు దిగుతున్నారు. ఒక వైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి వైసీపీపై యుద్ధాన్ని ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దిగింది. ప్రభుత్వంపై పలువురు ముఖ్య నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఈ మేరకు ఇవాళ ఆయన ముద్రగడ పద్మనాభం, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సమావేశంలో ఇక నుంచి ప్రతి క్షణం పిఠాపురం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాలని మంత్రులకు జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. మండలాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించాలని వంగా గీత, ముద్రగడకు ఆయన సూచించారు. పకడ్బందీగా ప్రచారం నిర్వహించి ప్రతిపక్ష పార్టీకి ఎలాంటి స్కోప్ ఇవ్వకుండా విజయం సాధించేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని వారికి జగన్ దిశానిర్దేశం చేశారు.

Read More..

పవన్ తప్పుకుంటే సీటు నాదే..పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?

Next Story