- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Boat Marathon : బెజవాడలో.. బోట్ మారథాన్
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జల రవాణా మార్గాలను మూడింతలు పెంచేలా చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.

ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి రాజధాని అమరావతి వరకు..
కృష్ణా, గోదావరి సహా నదులలో..
జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తాం
బోట్ మారథాన్ ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జల రవాణా మార్గాలను మూడింతలు పెంచేలా చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం అని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఏర్పాటు చేసి నేటికి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) ఎగువన బోట్ మార థాన్ కార్యక్రమం నిర్వహించారు. పున్నమి ఘాట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ రాష్ట్రంలోని విశాలమైన తీర, నదీ పరివాహక ప్రాంతాలను వినియోగించుకుని పలు రూట్లలో టూరిజం, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ లను అభివృద్ది చేయనున్నామని తెలిపారు. పీపీపీ మోడల్ లో ద్వారా జల రవాణా ట్రాన్స్ పోర్టు వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులును ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి రాజధాని అమరావతి వరకు జల రవాణా మార్గాలను అభివృ ద్ధి చేస్తాం. కృష్ణా, గోదావరి సహా నదులు, సాగునీటి కాలువల్లో జలరవాణా చేపడతాం అని తెలిపారు. జల రవాణా ద్వారా పలు మార్గాల్లో బొగ్గు, సిమెంట్, రవాణాను చేపడతామని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణా నదిలో ఏపీ టూరిజం బోటులో పున్నమి ఘాట్ నుంచి గొల్లపూడి వరకు మంత్రి ప్రయాణించారు. కొద్దిసేపు బోటును డ్రైవ్ చేశారు.






