- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల కోడిగుడ్ల దాడి
విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడలోని (Vijayawada) ఆంధ్ర రత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ (Congess Party)కార్యాలయంపై బీజేపీ (BJP) కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. విజయవాడలో ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజధాని లోని ఉద్దండరాయుని పాలెంలో పర్యటిస్తానని వైఎస్ షర్మిa ముందుగా ప్రకటించారు. దీంతో ఆమె నివాసం వద్ద బుధవారం బందోబస్తు చేసి ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని కార్యాలయం పై కోడిగుడ్లు విసిరారు. దీంతో షర్మిల బయటకి వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బిజెపి కార్యకర్తలను ఆ విషయం డిమాండ్ చేశారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రోడ్డుపైకి చేరుకుని బైఠాయించారు. ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. లాఠీచార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. షర్మిల ఆందోళన కొనసాగుతూ ఉంది.






