నెయ్యి కాని నెయ్యి.. ప్రాణాలతో చెలగాటం..!

by Vemula.Srinu Prasad |

పాల సేకరణే చేయని డెయిరీ నెయ్యి సరఫరా చేస్తుందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ ప్రశ్నించారు...

నెయ్యి కాని నెయ్యి.. ప్రాణాలతో చెలగాటం..!
X

దిశ, వెబ్ డెస్క్: పాల సేకరణే చేయని డెయిరీ నెయ్యి(Dairy ghee) సరఫరా చేస్తుందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌(BJP State President PVN Madhav) ప్రశ్నించారు. రూ. 320కే నెయ్యి వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అని ఆయన నిలదీశారు. కల్తీ నెయ్యి(Adulterated ghee) వ్యవహారంపై మాధవ్ మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ హయాంలో టీటీడీ వ్యవహారం పరాకాష్టకు చేరిందని అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్‌ చిట్‌ ఇచ్చుకున్నారని తెలిపారు. నెయ్యి కాని నెయ్యితో లడ్డూ తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని, అన్యమతస్థుల ప్రాబల్యంతో ఓటు బ్యాంకు పెంచుకోవాలనేది వాళ్ల లక్ష్యమని మాధవ్‌ ఆరోపించారు.

తుంగలో నిబంధనలు


నిబంధనల్ని తుంగలో తొక్కి కల్తీ లడ్డూ తయారీకి తెరలేపారని అన్నారు. తిరుమల(Tirumala) ప్రక్షాళనకు ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతీయబోమని, నిబంధనల్ని కఠినతరం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాధవ్‌ చెప్పారు.

Next Story